ముంబైలో భవనం కూలిన ఘటనలో 12మంది మృతి

12-lost-their-life-in-mumbai-dongri-area

ఇంకా శిథిలాల కింద కనీసం 50 మంది ఉన్నారని అనుమానం

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని డోంగ్రీలో ఈ ఉదయం ఓ భవనం కుప్పకూలింది. నాలుగంతస్తుల కేసరిబాయ్ బిల్డింగ్ కూలిపోవడంతో… దాదాపు అరవై మంది దానికింద చిక్కుకుపోయినట్టు భావించారు. ఓ చిన్నారిని ప్రాణాలతో కాపాడారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 12 మంది మృతదేహాలు వెలికితీశారు సహాయక సిబ్బంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కనీసం 50 మంది భవన శిథిలాల కింద ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.

ఘటన స్థలంలో అంబులెన్స్ లు ఉంచారు. బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను హాస్పిటల్ కు తరలిస్తున్నారు. స్థానికులు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు భవనం కూలినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.

Latest Updates