కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

ఉత్తరాఖండ్ లో దారుణం

కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

13 మంది అధికారుల సస్పెన్షన్

రూర్కీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగడంతో… 12 మంది చనిపోయారు. హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణం పరిధిలో ఈ ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగిన వెంటనే బాధితులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని హాస్పిటల్ లో చేర్చినప్పటికీ… అప్పటికే పరిస్థితి విషమించింది. బాధితుల్లో 12 మంది చనిపోయారు. ఈ సంఘటనకు బాధ్యులైన 13 మంది ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates