కానిస్టేబుల్ పై  దాడి కేసులో 12 మంది అరెస్టు

వికారాబాద్​ జిల్లా వెలుగు: సీతారాముల కళ్యాణ జాతర ఉత్సవాల్లో బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్​పై చెయ్యి చేసుకున్న 16 మందిలో 12 మందిని రిమాండ్ కు తరలించినట్టు వికారాబాద్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తాండూరు నియోజకవర్గంలోని జూంటుపల్లిలో ఏప్రిల్ చివరివారంలో సీతారాముల కల్యాణం సందర్భంగా జాతర ఉత్సవాలు జరిగాయి. ఈ జాతర బందోబస్తుకు యాలాల పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వెళ్లారు. ఈ జాతరలో కొంతమంది మద్యం మత్తులో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ పై  చెయ్యి చేసుకున్నారు. అప్పట్లో కేసు నమోదు చేసినప్పకిటీ ఎన్నికల ప్రక్రియ ఉండటంతో రిమాండ్ కు తరలించలేకపోయామని పోలీసులు చెప్పారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం 12 మందిని అరెస్టు చేసి పరిగి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న నలుగురిని తొందరలోనే పట్టుకుని రిమాండ్ కు తరలిస్తామని ఎస్సై విఠల్ రెడ్డి చెప్పారు.

Latest Updates