ఏపీకి పోతం.. పంపండి సారూ.. ప్రభుత్వానికి 1200 మంది హోంగార్డుల వినతి

రాష్ట్రంలో 1200 మంది ఏపీ హోంగార్డులు

అక్కడ లోకల్.. ఇక్కడ డ్యూటీ కావడంతో చిక్కులు

అక్కడ సర్వీస్ రిజర్వేషన్.. ఇక్కడ లోకల్ కోటా వర్తిస్తలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వాళ్లందరూ ఏపీలో లోకల్. కానీ అక్కడ సర్వీస్ రిజర్వేషన్ లేదు. హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్నరు. కానీ.. ఇక్కడ లోకల్ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో హోంగార్డులుగా రిక్రూట్ అయి ఇక్కడే డ్యూటీ చేస్తున్నవారి పరిస్థితి ఇప్పుడిలా అయోమయంగా మారిపోయింది. ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లలో వీరికి సర్వీస్ రిజర్వేషన్ వర్తించడంలేదు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్లలో నాన్ లోకల్ అవుతున్నారు. దీంతో హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్న ఏపీ హోంగార్డులు తమను సొంత రాష్ట్రానికే పంపాలని కోరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఏపీ హోం మంత్రి సుచరితను కలిసి వినతిపత్రాలు కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఆసక్తి ఉన్న వారిని ఏపీకి  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక్కడ లోకల్ కాదు.. అక్కడ సర్వీస్ లేదు 

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు1,200 మందికి పైగా ఏపీకి చెందిన హోం గార్డులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిక్రూట్ అయి, అప్పటి నుంచి పనిచేస్తున్నారు. రూ.1,500 జీతం దగ్గర్నుంచి సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రస్తుతం రూ.20 వేల నుంచి 23 వేలు జీతం తీసుకుంటున్నారు. జీతం విషయంలో ఏపీ కంటే బాగానే ఉన్నా ఇక్కడ నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు వెంటాడుతున్నాయి. ఏపీకి చెందిన హోంగార్డుల స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ సొంత ఊళ్ళలోనే పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్న ఏపీ హోంగార్డులను నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తున్నారు. వాళ్లు ఏపీలోనే లోకల్ కావడంతో వాళ్ళందరికీ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజర్వేషన్ వర్తించడం లేదు. ఏపీలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే అక్కడ హోంగార్డు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్ కూడా దక్కడం లేదు. దీంతో పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్లకు తాము అనర్హులం అతున్నామని ఏపీ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇక్కడే కావడంతో భవిష్కత్తులో ఏపీలో ఉద్యోగాలకు కూడా స్థానికత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు తమకు అన్ని అర్హతలు ఉన్నా  నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవకాశాలు కోల్పోతున్నామని చెప్తున్నారు. తమను సొంత రాష్ట్రం ఏపీకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు.

రెండు ప్రభుత్వాలు చర్యలు తీస్కోవాలి  

మాది ప్రకాశం జిల్లా. 2006లో హోంగార్డుగా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో పనిచేస్తున్నాను. నాకు ఏపీ లోకల్ ఏరియా కావడంతో ఇక్కడి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు లోకల్ కోటాలో అర్హత లేకుండా పోయింది. ఇక్కడ డ్యూటీ చేస్తుండడంతో ఏపీ నోటిఫికేషన్లలో సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తించడం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆసక్తి ఉన్న వారిని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా చర్యలు తీసుకోవాలి.

– ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నారాయణ రెడ్డి, హోంగార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రకాశం జిల్లా

For More News..

రైతు వేదికల నిర్మాణంలో.. సగం పైసలు కేంద్రానివే

పర్మిషన్లు లేవ్​.. అప్పులు పుడ్తలేవ్​.. ప్రాజెక్ట్ పనులు ఆపేద్దామా

దుబ్బాకలో బీజేపీ జోష్

Latest Updates