కాళ్ల బేరానికొచ్చిన జొమాటో

న్యూఢిల్లీ : ఆన్‌‌‌‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్ జొమాటో కాళ్ల బేరానికొచ్చింది. రెస్టారెంట్లతో నడుస్తోన్న వార్‌‌‌‌‌‌‌‌లో కాస్త వెనక్కి తగ్గింది. తమ తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటామని జొమాటో చెప్పింది. అయితే తమ ప్లాట్‌‌‌‌ఫామ్ నుంచి లాగౌట్ కావొద్దని వేడుకుంది. మేజర్ సిటీల్లోని1,2 00 రెస్టారెంట్లు.. ఫుడ్ అగ్రిగేటర్లు ఆఫర్ చేసే డిస్కౌంట్ల ధాటిని తట్టుకోలేక డైన్ ఇన్ ప్రొగ్రామ్స్ నుంచి డీలిస్టయ్యాయి. జొమాటో గోల్డ్ ప్రొగ్రామ్‌‌‌‌కు కూడా రాంరాం చెప్పాయి. తొలుత రెస్టారెంట్లకు 45 రోజుల నోటీసు జారీ చేయాలంటూ హుకుం జారీ చేసిన జొమాటో, తాజాగా  తన తప్పులు సరిదిద్దుకుంటానంటూ మరో ప్రకటన చేసింది. జొమాటో గోల్డ్ ప్రొగ్రామ్ నుంచి 65 రెస్టారెంట్లు వైదొలిగాయి. దీనిపై జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్ పలు ట్వీట్లు చేశారు.

‘రెస్టారెంట్లకు ఏది మంచైతే మాకూ అదే మంచిది.  కన్స్యూమర్లకు ఏది మంచైతే మాకూ అదే మంచిది. రెస్టారెంట్ ఇండస్ట్రీలో సమస్యలకు పరిష్కారం కనుగొంటాం’ అని గోయల్ ట్వీట్ చేశారు. అంతేకాక ‘రెస్టారెంట్ ఇండస్ట్రీలో మా లాంటి యంగ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రిన్యూర్లకు ఇది నిజంగా బాధాకరం. ఎక్కడో మేము తప్పులు చేశాం. అన్నీ ప్లాన్ ప్రకారం నడవవు కదా.. కన్స్యూమర్లకు, బిజినెస్ ఓనర్లకు పెద్ద ఎత్తున ప్రయోజనం చూపేలా మేము కంపెనీని క్రియేట్ చేశాం’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీతో కలిసి పనిచేసేందుకే జొమాటో కట్టుబడి ఉంటుందని గోయల్ తెలిపారు. రెస్టారెంట్లను, కన్స్యూమర్లను గెలిచేలా జొమాటో గోల్డ్‌‌‌‌ను మారుస్తామని చెప్పారు. గతేడాది లాగానే.. రెస్టారెంట్ కమ్యూనిటీలోని ఆందోళనల మేరకు గోల్డ్‌‌‌‌లో కొన్ని నిబంధనలను మారుస్తామని చెప్పారు. లాగౌట్ క్యాంపెయిన్‌‌‌‌ను మాత్రం రెస్టారెంట్ ఓనర్లు ఆపాలని గోయల్ అభ్యర్థించారు. కన్స్యూమర్ల ప్రయోజనాల మేరకు లాగౌట్ చేపట్టవద్దని వేడుకున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌‌‌‌కతా, గోవా, పుణే, గుర్గావ్, వడోదర లలోని రెస్టారెంట్లు జొమాటో, ఈజీడైనర్,నియర్‌‌‌‌‌‌‌‌బై, మ్యాజిక్‌‌‌‌పిన్ వంటి ప్లాట్‌‌‌‌ఫామ్స్ నుంచి లాగౌట్ అయ్యాయి. గుర్గావ్‌‌‌‌లోప్రారంభమైన లాగౌట్ మూవ్‌‌‌‌మెంట్.. ఇప్పుడు దేశమంతా పాకిందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ) ప్రెసిడెంట్ రాహుల్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నారు. భారీ డిస్కౌంట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు.

ఫుడ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ల ధరలు తగ్గాలి…

జొమాటో గోల్డ్ ప్రొగ్రామ్.. డైనర్లకు పెయిడ్ మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రొగ్రామ్. దీన్ని 2017 నవంబర్‌‌‌‌‌‌‌‌న జోమాటో ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ కింద ఫుడ్, డ్రింక్స్‌‌‌‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్ వంటి డీల్స్‌‌‌‌ను అందిస్తోంది.    ఇది లాంచ్ అయినప్పటి నుంచి రెస్టారెంట్లకు బాగా దెబ్బకొట్టింది. జొమాటో గోల్డ్ లో జాయిన్ అయిన రెస్టారెంట్ ఇండస్ట్రీలోని కొన్ని సెగ్మెంట్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఫుడ్ సర్వీసెస్ బిజినెస్‌‌‌‌ల ధరలు తగ్గాలని కూడా గోయల్ కోరుతున్నారు. ఇండియాలో, చైనాలో సగటు డెలివరీ ఆర్డర్ ధర సమానంగా ఉందని, కానీ అక్కడ తలసరి ఆదాయం ఇండియా కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

Latest Updates