125 ఫీట్ల అంబేడ్కర్‌‌‌‌ స్టాచ్యూ డిజైన్ రిలీజ్

రూ. 140 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా

హైదరాబాద్, వెలుగు:  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించిన డిజైన్ రెడీ అయ్యింది. బుధవారం అసెంబ్లీ హాల్ లో మంత్రి ఈటల దాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ 125 వ జయంతి సందర్భంగా 125 అడుగుల స్టాచ్యూను ఏర్పాటు చేస్తామని సీఎం ఇచ్చిన హామీని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలోని 11 ఎకరాల్లో విగ్రహంతో పాటు అంబేడ్కర్ పార్క్, మ్యూజియం, లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు. 45.5 ఫీట్ల వెడల్పు ఉండే ఈ విగ్రహం కోసం 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి, 791 టన్నుల స్టీల్ ను వినియోగించనున్నారు. ఇందుకోసం రూ. 140 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

Latest Updates