తెలంగాణలో 1269 కరోనా పాజిటివ్ కేసులు.. 8 మంది మృతి

హైదరాబాద్: గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1269 కరోనా వైరస్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 8 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం ‌నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 800 కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 34,671 కోవిడ్ కేసులు న‌మోదు కాగా.. వైర‌స్ బారిన ప‌డి మరణించిన వారి సంఖ్య 356కు చేరింది. ఇవాళ 1563 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 22482 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11883 మంది మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డిలో 132 కేసులు, మేడ్చల్ జిల్లాలో- 94, సంగారెడ్డి జిల్లాలో 36 , వరంగల్ అర్బన్ 12 , కరీంనగర్ జిల్లాలో 23, మెదక్ జిల్లాలో 14, మహబూబ్ నగర్ జిల్లాలో 17, నల్లగొండ జిల్లాలో15, నాగర్ కర్నూలు జిల్లాలో 23, నిజామాబాద్ జిల్లాలో11, వనపర్తి జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.

Latest Updates