13న ఇంటర్ ఫలితాలు

INTER EXAMSఇంటర్‌ ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలను విడుదల చేస్తుండటం.. 14, 15 తేదీల్లో సెలవులుండటంతో 13నాడే ఫలితాలను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు గుర్తింపు పొందేందుకు ఏప్రిల్ 15 లోపు తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌.

దీనిపై సోమవారం (ఏప్రిల్-8) ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఇంటర్‌ కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. హాస్టళ్లకు సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని యాజమాన్యాలు తెలిపాయని.. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates