13 కోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు : మోడీ

MODI GASGఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లల్లో 13 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. గత 60 ఏళ్లల్లో 13 కోట్ల మంది ధనికులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని మోడీ గుర్తుచేశారు. నమో యాప్ ద్వారా పలు రాష్ట్రాల మహిళలు, లబ్ధిదారులతో ప్రధాని నేరుగా మాట్లాడారు. ఉజ్వలయోజన పథకం ద్వారా 10 కోట్ల గ్యాస్ సిలెండర్లు… నిరుపేదలు, దళిత, గిరిజనులకు అందించామన్నారు మోడీ. అన్నివర్గాల మహిళలు సామాజిక సాధికారత సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Posted in Uncategorized

Latest Updates