బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటిస్టెంట్స్

గత సీజన్లకు భిన్నంగా సాగుతోంది హిందీ బిగ్‌‌బాస్‌‌. ప్రస్తుతం నడుస్తున్న పదమూడో సీజన్‌‌లో ఆదివారం ఫస్ట్‌‌ ఫైనల్‌‌ పూర్తైంది. మొత్తం పన్నెండుమందితో మొదలైన ఈ షోలో గతవారం తొమ్మిదిమంది పార్టిసిపెంట్స్‌‌ ఉండేవాళ్లు. అయితే ఆదివారం జరిగిన ఫస్ట్‌‌ ఫైనల్‌‌లో ఒకేసారి ముగ్గురిని ఎలిమినేట్‌‌ చేశాడు బిగ్‌‌బాస్‌‌. హయ్యెస్ట్‌‌ పెయిడ్‌‌ కంటెస్టెంట్‌‌గా భావిస్తున్న రష్మీ దేశాయ్‌‌, దేబలీనా భట్టాచార్జీ, షెఫాలి బగ్గా ఆదివారం ఎలిమినేట్‌‌ అయ్యారు. దీంతో మొత్తం ఆరుగురే హౌజ్‌‌లో మిగిలారు. కానీ, షో ఇంకా దాదాపు 70 రోజులు ఉంది. మరి ఇన్ని రోజులు ఆరుగురు కంటెస్టెంట్స్‌‌తోనే అంటే ఆడియెన్స్‌‌ను ఆకట్టుకోవడం కష్టం. అందుకే మరో ఆరుగురు వైల్డ్‌‌కార్డ్‌‌ ద్వారా ‘బిగ్‌‌బాస్‌‌’ హౌజ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అర్హాన్‌‌ ఖాన్‌‌, హిమాన్షి ఖురానా హౌజ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకేసారి ముగ్గురిని ఎలిమినేట్‌‌ చేయడంపై ఆడియెన్స్‌‌ విమర్శిస్తున్నారు.
అయితే వీళ్లలో ఒకరు లేదా ఇద్దరిని సీక్రెట్‌‌రూమ్‌‌లోకి పంపించి ఉండొచ్చని, తర్వాత తిరిగి హౌజ్‌‌లోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు. తెలుగులో కూడా మొదట రాహుల్‌‌ను ఎలిమినేట్‌‌ చేసి, తర్వాత హౌజ్‌‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Latest Updates