ఏపీలో 13కు చేరిన కరోనా కేసులు

అమరావతి, వెలుగు: ఏపీలో మరో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విశాఖపట్నం, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నంలో వైరస్ సోకిన బాధితుడి కుటుంబంలో మరొకరికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో చెప్పింది. ఏపీలో పాజిటివ్​ కేసుల సంఖ్య 13కు చేరినట్లు వెల్లడించింది.

ఐసొలేషన్​ వార్డు నుంచి బాధితుడు పరార్​ కరోనా లక్షణాలున్న ఓ బాధితుడు గుంటూరు జీజీహెచ్​ ఐసొలేషన్​ వార్డు నుంచి పరారయ్యాడు. ఫారిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని రెండు రోజులుగా ఐసొలేషన్​వార్డులో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు.​ శుక్రవారం క్వారంటైన్​కు షిఫ్టు చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఐసొలేషన్​ వార్డు నుంచి క్వారంటైన్​కు షిఫ్ట్​ చేసే సమయంలో కేస్ షీట్ తీసుకుని బాధితుడు పరారైనట్లు డాక్టర్లు చెప్పారు. వెంటనే పోలీసులను ఫిర్యాదు చేశారు.

ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా టెస్టులు

Latest Updates