13 రకాల ఫీచర్లతో టైటాన్ స్మార్ట్‌‌వాచ్​

బెంగళూరు : ‘టైటాన్ కనెక్టెడ్ ఎక్స్’ పేరుతో ఫుల్ టచ్ స్మార్ట్‌‌వాచ్‌‌ని లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌‌ కోసం రూపొందిన ఈ వాచ్‌‌లో 13 రకాల ఫీచర్లున్నాయి. హార్ట్ రేటు మానిటరింగ్, ఫైండ్ ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్, క్యాలెండర్ అలర్ట్స్, మ్యూజిక్, సెల్ఫీ ఫీచర్లను టైటాన్ ఆఫర్ చేస్తోంది. ఈ వాచ్ ధర రూ.14,995గా టైటాన్ పేర్కొంది.టైటాన్  కనెక్టెడ్ ఎక్స్ ప్రొడక్ట్‌‌ వచ్చే నెల నుంచి అన్ని లీడింగ్ టైటాన్‌‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సీఈవో (వాచెస్‌‌ అండ్‌‌ వేరబుల్స్‌‌) రవికాంత్ చెప్పారు.

టైటాన్ చేతికి హగ్‌‌ ఇనొవేషన్స్‌‌

హైదరాబాద్‌‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్ సంస్థ హగ్‌‌ ఇనొవేషన్స్‌‌ను టైటాన్ కొనుగోలు చేసింది.   హగ్‌‌ ఇనొవేషన్స్‌‌ సీఈవో, ఫౌండర్ రాజ్ నేరావతితోపాటు, 23 మంది టీమ్‌‌ ఇప్పుడు  టైటాన్‌‌లో భాగమైనట్లు   రవికాంత్ తెలిపారు. హగ్‌‌ కన్జూమర్ ప్లాట్‌‌ఫామ్‌‌, ఐపీ తమ చేతికి రావడంతో  టైటాన్ వేరబుల్ జర్నీ మరింత ఊపందుకుంటుందని అన్నారు.  ఈ అక్విజిషన్‌‌తో హైదరాబాద్లో  టైటాన్‌‌కు  డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌ దొరికినట్లైందని అన్నారు.

Latest Updates