ఫ్రాన్స్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. 13 మంది జవాన్ల మృతి

ఫ్రాన్స్‌ లో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కూలిన హెలికాప్టర్ లో 13 మంది జవాన్లు చనిపోయారు. మాలిలో జిహాదిస్టులపై జవాన్లు దాడులు జరుపుతున్నారు. అదే  సమయంలో వారి హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది జవాన్లు చనిపోయారు. విషయం తెలుసుకున్న ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Latest Updates