అయిదురోజుల్లో రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కు గురైన 13 ఏళ్ల బాలిక

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలిక ఐదుగురు రోజుల్లో రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై నేరాల గురించి ‘సమ్మన్’ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత ఆరు రోజుల్లో ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. దాంతో రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రశ్నలు వస్తున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల బాలికను జనవరి 4న ఆమెకు తెలిసిన యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అతడితో పాటు అతని ఆరుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాలికను విడిచిపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించారు. దాంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అత్యాచారం జరిగిన ఆరు రోజుల తర్వాత జనవరి 11న.. మొదటిసారి ఆమెను అత్యాచారం చేసిన ఏడుగురిలో ఒకరు ఆమెను మళ్ళీ కిడ్నాప్ చేశాడు. గ్రామానికి దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు మళ్లీ ఆమెపై అత్యాచారం చేశారు. ఆ కామాంధులు శుక్రవారం తెల్లవారుజామున అమ్మాయిని విడిచిపెట్టారు. అక్కడి నుంచి బాలిక ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఆమెను బలవంతంగా ట్రక్‌లోకి ఎక్కించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. నిందితులపై పోస్కో మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది’ అని పోలీసు అధికారి అరవింద్ తివారీ తెలిపారు.

For More News..

దేవాలయానికి వెళ్లొస్తున్న బస్సుకు కరెంట్ వైర్లు తగిలి మంటలు.. ఆరుగురు మృతి

దేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ

పెళ్లి చేయమన్నందుకు కొడుకును చంపిన తండ్రి

దృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్‌లు చేస్తూ మేనేజ్

Latest Updates