ముంబై దాడులకు నేటితో 13 ఏళ్లు

V6 Velugu Posted on Nov 26, 2021

ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఇవాళ్టితో 13ఏళ్లు పూర్తయ్యాయి. ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ నివాలులర్పించారు. పాకిస్థాన్ జీహాది సంస్థ అయిన లష్కరే తోయిబాకి చెందిన 10 మంది సభ్యులు నాలుగు రోజుల పాటు దాడులకు పాల్పడ్డారు. ఐకానిక్ తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్ , నారిమన్ హౌజ్, మెట్రో సినిమా, ఛత్రపతి శివాజీ టెర్మినల్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 15 దేశాలకు చెందిన 166 మంది చనిపోయారు. ఈ ఘటనలో 9 మంది ఉగ్రవాదులను నేషనల్ సెక్యురిటీ గార్డ్, ముంబై పోలీసులు చంపేశారు. కాగా.. సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ ను 2012 నవంబర్ 21న ఉరితీశారు.

26/11 ముంబై ఉగ్రదాడిలో అమరులైన వారికి నేతలు హృదయపూర్వక నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన భద్రతా దళాల ధైర్యసాహసాలు మరియు త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.  ఉగ్రదాడుల పిరికి దాడికి వ్యతిరేకంగా అలుపెరగని స్ఫూర్తిని ప్రదర్శించిన భద్రతా బలగాలందరి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని దేశ హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశం మొత్తం మీ ధైర్యానికి గర్వపడుతూ.. మీ త్యాగానికి రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. నాటి ఘటనలో అమరులైన వీరులందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ, సుదర్శన్ పట్నాయక్ తదితరులు నివాలర్పించారు.

 

 

Tagged Maharashtra, Mumbai, Ajit Pawar, kasab, mumbai attacks, dilip walse patil

Latest Videos

Subscribe Now

More News