13,567 వెహికల్స్ సీజ్.. మరి అవన్నీ ఇచ్చేది ఎప్పుడో తెలుసా..

ఎపిడమిక్‌‌‌‌‌‌‌‌ డిసీజ్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద కేసులు
లాక్ డౌన్ తర్వాతే వాహనాల రిలీజ్

హైదరాబాద్,వెలుగు: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్డెక్కుతున్న వాహనదారులకు పోలీసులు షాక్ ఇస్తున్నారు. లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్, సీసీ కెమెరాల సాయంతో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం వరకు 13,567 వెహికల్స్ సీజ్ చేశారు. చెక్ పోస్టుల వద్ద, ట్రాఫిక్ చెకింగ్ లో వెహికల్ నెంబర్లు నోట్ చేసి టీఎస్ కాప్ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. 3 కి.మీ దూరం దాటి వెళ్లే వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఆ వాహనదారులకు ఎపిడమిక్‌ డిసీజ్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద 6 నెలల నుంచి సుమారు 2 ఏండ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ విధించే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సీజ్డ్ వెహికల్స్ ను లాక్ డౌన్ ముగిసిన తర్వాతే అప్పగిస్తారు.

For More News..

ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..

Latest Updates