14 బాల్స్ 51 రన్స్ : మెరుపు వేగంతో KL రాహుల్ హాఫ్ సెంచరీ

kl-rahulఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) మొహలీ వేదికగా డిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ KL రాహుల్ విరుచుకుపడ్డాడు. 14 బాల్స్ లోనే 51( 4సిక్సులు, 6 ఫోర్స్) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కి మంచి ఆరంభం దక్కింది. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్‌ బౌండరీల మోత మోగించాడు.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌ లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసి ఇప్పటివరకూ యూసఫ్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును బద్ధలు కొట్టాడు. 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌ ఈ ఫీట్‌ సాధించగా, 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌.. పఠాన్‌ సరసన చేరాడు. దాన్ని లేటెస్ట్ గా రాహుల్‌ సవరించి కొత్త మైలురాయిని సాధించాడు. 6 ఓవర్లు ముగిసేసమయానికి 2 వికెట్ల నష్టానికి 73పరుగులు చేసింది. 4.5 ఓవర్ లో బోల్ట్ బౌలింగ్ లో జౌటయ్యాడు రాహుల్. ప్రస్తుతం యువరాజ్(10), కరుణ్ నాయర్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates