హేమంత్ హత్య కేసులో 14 మందిని అరెస్టు చేశాం: డీసీపీ వెంకటేశ్వర్లు

హేమంత్ హత్య కేసులో 14 మందిని అరెస్టు చేశామన్నారు మాదాపూర్  డీసీపీ వెంకటేశ్వర్లు. ఈ నెల  హేమంత్ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి ప్లాన్ చేశారని చెప్పారు. హేమంత్ ను చంపేందుకు 10 లక్షలకు ముగ్గురి కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని…నిన్న మూడు కార్లలో హేమంత్ ఇంటికి వెళ్లిన నిందితులు… బలవంతంగా కారులో తీసుకెళ్లి హత్యచేసి సంగారెడ్డిలో డెడ్ బాడీని పడేశారని తెలిపారు.

చందానగర్ లోని ఒకే ఏరియాలో ఉంటున్న అవంతి,హేమంత్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అవంతి తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో.. జూన్ లో కుత్బుళ్లాపూర్  సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారని తెలిపారు మాదాపూర్  డీసీపీ వెంకటేశ్వర్లు. అయితే కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అవంతి తల్లిదండ్రులు చందానగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు గా ఫిర్యాదు చేశారు.

పెళ్లి తర్వాత పెద్దల సమక్షం లో కౌన్సిలింగ్ ఇవ్వడం తో అవంతి.. హేమంత్  తోనే కలిసి ఉంటానని పోలీసులకు తెలపిందన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హేమంత్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయంలో యుగంధర్ రెడ్డి కూడా సహకరించాడు.  దీంతో వటీనాగులపల్లి బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డు అలియాస్ పాషా అనే కిరాయి హంతకులతో 10 లక్షలకు మాట్లాడుకున్నారు. ముందుగా లక్షరూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న హంతకులు..మిగతా తర్వాత ఇచ్చేట్లుగా మాట్లాడుకున్నారు.

మూడు కార్లలో హేమంత్, అవంతి ఉంటున్న గచ్చిబౌలి ఎన్జీవో కాలనీలో  ఇంటికి  వెళ్లి వారిని బలవంతంగా కార్లలో ఎక్కించుకుని..ORR వైపు వెళ్లారు. అయితే అనుమానం వచ్చిన ఇద్దరు కారులోంచి దూకి  పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే హేమంత్ వెనకాలే కారులో వచ్చి అతన్ని కారులోకి ఎక్కించుకుని వెళ్లి పోయారు. వారి నుంచి తప్పించుకున్న అవంతి డయల్ 100కు ఫోన్ చేసింది.

హేమంత్ ను కారులో బలవంతంగా ఎక్కుంచుకున్న యుగంధర్ రెడ్డి… ORR మీదుగా జహీరాబాద్ వెళ్ళాడు. జహీరాబాద్ లో  లిక్కర్, తాడు కొన్నారు. హేమంత్ మెడకు తాడు బిగేసి అత్య చేసిన తర్వాత.. సంగారెడ్డి ఎమ్జీ ఎలైట్ వెంచర్ లో డెడ్ బాడీ ని పడేశారు. హత్య చేసిన తర్వాత ఎల్లమ్మ గుడి దగ్గర  మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నారు. మందు తాగిన సమయంలో సంతోష్ రెడ్డి కి యుగంధర్ రెడ్డి ఫోన్ చేశాడు. అప్పటికే సంతోష్ రెడ్డి  పోలీసుల కస్టడీలో ఉండడంతో తమకు  ఈ కేసు చేధించడం ఈజీ అయ్యిందన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు. మర్డర్ చేసిన వారిని..సహకరించిన వారిని అరెస్టు చేశామని తెలిపారు. అన్ని రకాల ఎవిడెన్స్ ఈ కేసు లో సేకరించామని చెప్పారు.

Latest Updates