బీఎస్ఎఫ్ వంటమనిషికి వైరస్.. క్వారంటైన్​కు 14 మంది జవాన్లు

న్యూఢిల్లీ: ఆగ్రా నుంచి తిరిగి వచ్చిన 14 మంది బీఎస్​ఎఫ్ జవాన్లకు కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో క్వారంటైన్ కు తరలించినట్లు చత్తీస్​గఢ్ అధికారులు వెల్లడించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించామని, రిపోర్టులకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఆగ్రాలోని పోలీస్ లైన్స్ వద్ద క్యాంప్ లో ఉన్న బీఎస్ ఎఫ్ దళాలు ఆదివారం చత్తీస్​గఢ్ లోని భిలాయ్ కు చేరుకున్నాయి. వీరు ఆగ్రాలో బస చేసిన క్యాంప్ వంటమనిషికి వైరస్ సోకిందన్న సమాచారం మేరకే 14 మంది జవాన్లను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇందులో ఇద్దరిని దుర్గ్ జిల్లాలోని ఐసోలేషన్ సెంటర్​కు మిగిలిన వారిని భిలాయ్ స్టీల్ ప్లాంట్ లోని క్వారంటైన్ సెంటర్ కు తరలించామన్నారు. లాక్​డౌన్ కాలంలో జవాన్లను కదలికలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎస్ఎఫ్​ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ తన కమాండర్లకు, సిబ్బందికి ఇప్పటికే ఆదేశించారు.

Latest Updates