రూ. 5 కోట్ల 46 లక్షల విలువైన బంగారాన్ని టేప్‌తో చుట్టి..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 14 కేజీల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల వద్ద నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని బ్లాక్ టేప్ లతో చుట్టి , సీట్ లోపల దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆ బంగారం విలువ రూ. 5 కోట్ల 46 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

14 kg of gold seized at Shamshabad airport by DRI Officials

Latest Updates