తెలంగాణలో కరోనా కట్టడిలో లక్షల జనాభా

స్టేట్లోని 130 క్లస్టర్లలోజనం బయటకు రాకుండా నిషేధం
ఇంటింటి సర్వే చేస్తున్న మెడికల్ టీమ్స్

హైదరాబాద్‌, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో రాష్ర్టంలో 14.40 లక్షల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన
130 క్లస్టర్లలో జనాలు ఇంటి నుంచి బయటకు రాకుండా అధికారులు నిషేధం విధించారు. వారికి రోజూ కావాల్సిన వస్తువులను కూడా ఇండ్లకే పంపిస్తున్నారు. హైదరాబాద్‌‌, కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్, వరంగల్‌ ‌అర్బన్, గద్వాల్, నిర్మల్, సూర్యాపేట సహా కేసులు ఎక్కువగా నమోదైన పలు
జిల్లాల్లో ఈ క్లస్టర్లు ఉన్నాయి. ఏఎన్‌‌ఎంలు, ఆశ కార్యకర్తలతో కూడిన 3,116 టీంలు ఈ క్లస్టర్లలో ఇంటింటి సర్వే చేస్తున్నాయి. 130 క్లస్టర్లలో 2,88,548 ఇండ్లు ఉండగా, 2.65 లక్షల ఇండ్లలో సర్వే పూర్తయ్యిందని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

కంప్లీట్ లాక్డౌన్
కేసుల తీవ్రతను బట్టి జిల్లా అధికారులు క్లస్టర్లను మ్యాపింగ్‌‌ చేశారు. కిలోమీటర్‌ ‌నుంచి 3 కిలోమీటర్ల వరకూ సర్వే చేయాలని నిర్ణయించారు. మొదట ఏఎన్‌‌ఎం, ఆశ కార్యకర్తల టీంలు సర్వే చేస్తాయి. అనుమానితులను గుర్తిస్తే, డాక్టర్లతో కూడిన టీమ్‌లు పరిశీలిస్తాయి. అవసరమైతే దవాఖానాలకు తరలిస్తారు. ఆయా క్లస్టర్లలో పాజిటివ్ కేసులు నమోదైనప్పటి నుండి 14 రోజులు లాక్‌‌డౌన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే ఎవరికైనా వైరస్ సోకి ఉంటే, ఈ 14 రోజుల్లో బయట పడే అవకాశం ఉంటుంది. ఇంటింటి సర్వే తర్వాత ఎవరికీ లక్షణాలు లేవని, వైరస్ వ్యాప్తి లేదని భావిస్తే సడలింపు ఇస్తామని అధికారులంటున్నారు.

For More News..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. క్వార్టర్ మందు రూ. 1,000

నిత్యావసర సరుకుల కోసం జనం తిప్పలు

Latest Updates