రూ.14 లక్ష‌ల విలువైన వైద్య‌ప‌రిక‌రాలు సాయం

కరోనా చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు. తమ శక్తి మేరకు సాయం అందించేందుకు దాత‌లు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్ర‌వారం ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ప్ర‌తినిధులు రూ. 14 లక్షల విలువైన‌ వైద్య పరికరాలను గాంధీ , నిలోఫర్ హాస్పిట‌ల్స్ కి అందించారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిని శుక్ర‌వారం బీఆర్ కేఆర్ భవన్ లో క‌లిసిన‌ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ప్రతినిధులు..మొత్తం 14 లక్షల వైద్య పరికారాల్లో 7 లక్షల రూపాయల పరికరాలు గాంధీ ఆస్పత్రికి , 7 లక్షల రూపాయల పరికరాలు నిలోఫర్ కు కేటాయించారు. ఎన్95, పిపిఈ కిట్స్, ఏరో మిషన్లను ప్రభుత్వానికి అందించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని ప్రకిటించారు బ్రాంచ్ ప్రతినిధులు.

Latest Updates