వార్డెన్ నిర్లక్ష్యంతో 14 మంది అంధులకు కరోనా

హైదరాబాద్, వెలుగు: మెహిదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ అంధుల వసతి గృహంలో వార్డెన్, స్టాఫ్ నర్సుతో పాటు 14 మంది అంధులకు కరోనా సోకింది. వార్డెన్ నిరక్ష్ల్యంతోనే వీరికి వైరస్ అంటుకుంది. హాస్టల్ వార్డెన్ భార్యకు వారం క్రితం పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని దాచిపెట్టిన వార్డెన్ హోం క్వారంటైన్ లో ఉండకుండా, డ్యూటీకి వచ్చాడు. దీంతో అతని వల్ల అంధులు కరోనా బారినపడ్డారని ‘ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ద బ్లైండ్’ సెంట్రల్ ఎగ్జిక్యూ టివ్ కౌన్సిల్ మెంబర్ స్వామి నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వార్డెన్ లు రూల్స్ పాటించకపోవడంతోనే కరోనా వ్యాప్తిచెందుతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

For More News..

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు

ఇగ కొత్త చదువులు

మన నేలపై కన్నేసిన వారికి ఇదో హెచ్చరిక

Latest Updates