టీ అమ్ముతూ తన అక్కా – చెల్లెల్ని చదివిస్తున్న 14ఏళ్ల బాలుడు

కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. దీంతో కుటుంబపోషణ కోసం రోజూవారి కూలీలుగా మారిపోతున్నారు. ముంబైకి చెందిన ఓ మహిళ కరోనా కారణంగా ఉద్యోగం పోగొట్టుకుంది. కుటుంబపోషణ కోసం పనిచేద్దామంటే పనిదొరకడం లేదు. భర్త 12ఏళ్ల క్రితమే చనిపోవడంతో కొడుకు, ఇద్దరు కూతుళ్లను తనే చూసుకుంటుంది. దీంతో తల్లి బాధను చూడలేని 14ఏళ్ల సుభాన్ చదువు మానేసి రోడ్లవెంట టీ అమ్ముతున్నాడు. షాప్ పెట్టుకునేందుకు డబ్బులు లేక..ఇంట్లోనే టీ తయారు చేసి షాపుల వెంట తిరుగుతూ తన అక్క – చెల్లెలికి ఆన్ క్లాస్ లు ఇప్పిస్తున్నాడు. తనతో అక్క ‌‌– చెల్లెళ్లు చదువుకోవడం సాధ్యం కాదని, అందుకే మధ్యలోనే తాను చదువు మానేసినట్లు చెప్పాడు.  ఉదయం నుంచి సాయంత్రం వరకూ టీలు అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు ఈ 14ఏళ్ల బాలుడు .

 

Latest Updates