ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌: ఇషా సింగ్‌‌ కు రెండు స్వర్ణాలు

ఇండియా యువ షూటర్‌‌, హైదరాబాదీ ఇషా సింగ్‌‌ తన గురితో మరోసారి అదరహో అనిపించింది. ఇటీవల వరుస మెడల్స్‌‌తో హోరెత్తిస్తున్న తెలంగాణ టీనేజర్ స్వర్ణకాంతులు విరజిమ్మింది. ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో 14 ఏళ్ల ఇషా సింగ్‌‌జూనియర్‌‌ వరల్డ్‌‌ రికార్డు బద్దలు కొడుతూ.. రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌ గెలిచింది. ఆమెతో పాటు వివాన్‌‌ కపూర్‌‌ డబుల్‌‌ గోల్డ్‌‌ సాధించగా.. మహిళల 25 మీటర్ల పిస్టల్‌‌ ఫస్ట్‌‌ క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో ఐదో ప్లేస్‌‌ (292 స్కోరు)లో నిలిచిన చింకీ యాదవ్‌‌ ఒలింపిక్‌‌ బెర్తు ఆశలు సజీవంగా నిలుపుకుంది. గురువారం జరిగిన జూనియర్‌‌ మహిళల పది మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ ఫైనల్లో ఇషా సింగ్‌‌ 242.2 స్కోరుతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. సిల్వర్‌‌ గెలిచిన కొరియా షూటర్‌‌ హ్యొ జెయెంగ్‌‌ (237.3) కంటే ఏకంగా 4.9 పాయింట్ల డిఫరెన్స్‌‌తో ఇషా గోల్డ్‌‌ నెగ్గడం విశేషం. ఇండియాకే చెందిన మరో యువ షూటర్‌‌ ప్రియా రాఘవ్‌‌ 217.6 స్కోరుతో కాంస్యం సాధించింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో ఇషా 579 స్కోరుతో టాప్‌‌ ప్లేస్‌‌తో ఫైనల్‌‌కు క్వాలిఫై అయింది. తుదిపోరులోనూ అదరగొట్టి మెడల్‌‌ పట్టిన ఈ హైదరాబాదీ.. జూనియర్‌‌ వరల్డ్‌‌ కప్‌‌, ఆసియా ఎయిర్‌‌ గన్‌‌తో పాటు ఆసియా చాంపియన్‌‌షిప్‌‌లో చాంపియన్‌‌గా నిలిచిన యంగెస్ట్‌‌ షూటర్‌‌గా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన టీమ్‌‌ ఈవెంట్‌‌లో ప్రియ, యువికా తోమర్‌‌తో కలిసి బరిలోకి దిగిన ఇషా సింగ్‌‌ 1721 పాయింట్లతో జూనియర్‌‌ వరల్డ్‌‌ రికార్డు, ఆసియా జూనియర్‌‌ రికార్డును బద్దలు కొడుతూ గోల్డ్‌‌ గెలిచింది. ఇండియా స్కోరులో ఇషా అందరికంటే ఎక్కువగా 579 పాయింట్లు రాబట్టడం విశేషం. ఇక, జూనియర్‌‌ పురుషుల ట్రాప్‌‌ వ్యక్తిగత విభాగంలో వివాన్‌‌ కపూర్‌‌45 స్కోరుతో టాప్‌‌లో నిలవగా.. ఇండియాకే చెందిన భౌవ్‌‌నీశ్‌‌ మెండిరటా సిల్వర్‌‌ నెగ్గాడు. మానవాదిత్య సింగ్‌‌ రాథోడ్‌‌తో కలిసి టీమ్‌‌ ఈవెంట్‌‌లోనూ వివాన్‌‌ స్వర్ణం నెగ్గాడు. జూనియర్‌‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌‌ 3 పొజిషన్స్‌‌లో భక్తి భాస్కర్‌‌ 453.1 స్కోరుతో ఇండియాకు మరో గోల్డ్‌‌ అందించింది. పురుషుల ఫైనల్లో నీరజ్‌‌ కుమార్‌‌ 455.7 స్కోరుతో సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచాడు. ఈ రెండు విభాగాల టీమ్‌‌ ఈవెంట్లలో ఇండియా జూనియర్‌‌ జట్లు సిల్వర్‌‌ మెడల్స్‌‌ నెగ్గాయి.

Latest Updates