వీడియోగేమ్స్ ఆడొద్దని తిట్టినందుకు…

గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్న14 ఏళ్ల బాలుడు

ఆస్పత్రిలో చికిత్స ఫలించక బాలుడి మృతి

చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీలో ఘటన

 చిత్తూరు: వీడియో గేమ్స్ ఆడొద్దని తల్లి తిట్టినందుకు కోపంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్న 14 ఏళ్ల బాలుడి ఉదంతం చిత్తూరు జిల్లా పలమనేరు లోని శ్రీనగర్ కాలనీ లో జరిగింది. ప్రతిరోజు ఆన్ లైన్ క్లాసులు.. అయిపోయాక రాత్రి పగలు తేడా లేకుండా వీడియో గేమ్స్ ఆడుతుండడం గమనించి మందలించేవారు. తల్లి తిట్టడంతో కోపంగా గదిలోకి వెళ్లి .. గడియ పెట్టుకున్నాడు. చనిపోతున్నానంటూ.. స్టూల్ తీసుకుని ఫ్యాను కు చున్నీతో ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించి తల్లిదండ్రులు తలుపులు బాది బలవంతంగా తెరచి చూడగా బాలుడు అప్పటికే ఫ్యాన్ కు వేలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే  పలమనేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం  తిరుపతి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

 

Latest Updates