రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు

బడ్జెట్ లో రైతు బంధు పథకానికి 14 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. 2019-20 లో ఎకరానికి  రూ.10 వేల చొప్పున 12 వేల  కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించామన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు మంజూరు కావడంతో రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగనుందన్నారు. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్ లో రెండువేల కోట్ల రూపాయలను అదనంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.

పంట సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు బంధు పథకంతో రైతాంగానికి ఎంతో ఊరట కలుగుతోందన్నారు మంత్రి హరీష్. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రైతు బంధు తరహా పథకాలను ప్రవేశపెట్టాయన్నారు. కేంద్ర కూడా ఇదే పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని(PM-KISAN) రూపొందించిందన్నారు.

రాష్ట్రంలోని రైతులకు మొదట ఎకరానికి 4వేల రూపాయల చొప్పున…రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల రూపాయల చొప్పున..రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీతో రైతు బంధు సాయాన్ని ఏకరానికి ఏడాదికి 10 వేల రూపాయలకు పెంచి అందిస్తోందన్నారు. రైతు బంధు ద్వారా 2018-19 సంవత్సరం వానాకాలంలో 5,235 కోట్ల రూపాయలను, యాసంగిలో 5,244 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా సాయంగా అందించిందన్నారు.

రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ రంగాన్న అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించిందన్నారు. వ్యవసాయాభివృద్ధి విధానంలో రాష్ట్రం యావత్ దేశానికి ఆధర్శంగా నిలిచిందన్నారు.

Latest Updates