సంక్రాంతికి 146 స్పెషల్‌‌‌‌ ట్రైన్స్.. 30% అదనపు ఛార్జీలు

పండుగకు 146 స్పెషల్‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌

వెల్లడించిన రైల్వే శాఖ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలందరూ రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉండే సుమారు మూడు లక్షల మంది వారివారి ఊళ్లకు వెళతారని అంచనా. ఈ నేపథ్యంలో పాసింజర్ల రద్దీని దృష్టిలో పెట్టుకున్న సౌత్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ రైల్వే.. స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌‌‌‌‌ నడపాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాలకు మొత్తం 146 స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌‌‌‌‌ నడపుతున్నట్టు వెల్లడించింది. ఏపీకే ఎక్కువ సర్వీసులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రైన్లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా చార్జీలు వసూలు చేయనున్నారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్‌‌‌‌‌‌‌‌ డివిజన్ల పరిధిలోని స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్లను నడిపించనున్నారు.

టికెట్‌‌‌‌‌‌‌‌పై 30% అదనపు ఛార్జీలు

స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్లలో టికెట్‌‌‌‌‌‌‌‌పై 25% నుంచి 30% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. సుమారు తత్కాల్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ ఛార్జ్‌‌‌‌‌‌‌‌ కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఇప్పటికే చాలా ట్రైన్లలో బుకింగ్స్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అవ్వగా.. కొన్ని రూట్లలో 300 వరకు వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ ఉంటోంది. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌‌‌‌‌ అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి ఉన్న కారణంగా ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌ అందరూ కరోనా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ పాటించాలని సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో థర్మల్ స్కానర్లతో టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాతే ట్రైన్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతిస్తామన్నారు.

For More News..

గర్భిణీ ఉద్యోగులకు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌

ఫేక్‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌లతో 67.7 కోట్ల జీఎస్టీ ఎగవేత

వరంగల్‌‌‌‌‌కు రూ.162 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Latest Updates