15నుంచి శ్రమయోగి

. అసంఘటిత కార్మికులకు రూ.3వేల పెన్షన్

అసంఘటిత కార్మికులకు పెన్షన్‌ అందించే ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌(PMSYM) పథకం కింద లబ్ధిపొందేందుకు ఈనెల 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది కేంద్ర కార్మిక శాఖ. 10 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా PMSYM ప్రవేశ పెట్టినట్లు చెప్పింది. ఈ పథకంలో భాగంగా.. అసంఘటిత కార్మికులకు 60 ఏళ్ల వయసు తర్వాత ప్రతినెలా రూ.3వేలు పింఛను చెల్లిస్తారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర కార్మిక శాఖ శనివారం విడుదల చేసింది.

కనీస వయసు 18 సంవత్సరాలు.. గరిష్టంగా 40 ఏళ్లు ఉండాలి. ఈ పథకం లబ్ధిదారులు ప్రతినెలా కొంత మొత్తం చెల్లించాలి. అంతే మొత్తాన్ని కేంద్రం జమచేస్తుంది. పథకంలో సభ్యుడికి 60 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ప్రతినెలా రూ.3 వేలు పింఛను చెల్లిస్తారు. వయసును బట్టి ప్రీమియం ఉంటుంది. 18 ఏళ్ల వయసులోనే ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ.55 చెల్లిస్తే చాలు. 29 ఏళ్ల వయసు వారు రూ.100, 40 ఏళ్లు వచ్చి వారు ప్రతినెలా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తకులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, ఇటుకలబట్టీ కార్మికులు, చర్మకారులు, చెత్త ఏరుకునేవారు, ఇళ్లలో పనిచేసేవారు, రజకులు, రిక్షా కార్మికులు, భూమిలేని పేదలు, వ్యవసాయ కూలీలు అంతా అసంఘటిత కార్మికుల కిందకు వస్తారు.

జాతీయ పింఛను పథకం, ESIలో సభ్యులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అర్హులు కాదు.

PMSYM సభ్యుడు మరణిస్తే… ఆయన జీవిత భాగస్వామి దానిని కొనసాగించవచ్చు. అది ఇష్టం లేకపోతే అప్పటిదాకా చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగిస్తారు.

Latest Updates