15 మంది అరెస్ట్ : స్పా సెంటర్ పై పోలీసుల దాడులు

sexస్పా సెంటర్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న హైటెక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం (జూలై-4) హర్యానాలో జరిగింది. దేశ, విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న 15 మందిని గురువారం (జూలై-5) అరెస్టు చేశారు పోలీసులు.

అందులో అయిదుగురు విదేశీయులు ఉన్నారు. సెక్టర్ 29 మార్కెట్‌ లో ఉన్న ఓ స్పా సెంటర్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. థాయిలాండ్‌ కు చెందిన అయిదుగురు మహిళలతో పాటు మణిపూర్‌ కు చెందిన అయిదుగురు ఉన్నారు. ఇద్దరు విఠులను  అదుపులోకి తీసుకున్నారు. కొత్త పోలీస్ కమీషనర్ కేకే రావు ఆదేశాల మేరకు స్పా సెంటర్‌పై దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు గూర్గావ్ పోలీసు పీఆర్వో సుభాశ్ బోకన్.  ఐపీసీ, ఫారినర్స్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. స్పా ఓనర్ యుద్‌ వీర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates