బోట్లు మునిగి 15 మంది మత్స్యకారులు మృతి

15-fishermen-dead-2-missing-after-boats-capsize-off-gujarat

గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక, పోర్ బందర్ తీర ప్రాంతంలో బోట్లు మునిగిపోవడంతో 15 మంది మత్స్యకారులు జలసమధి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం  24 మంది మత్సకారులు ఆరు బోట్లతో రుపెన్ పోర్టు తీరంలో చేపలను వేటాడి తిరిగి వస్తుండగా నీళ్లలో మునిగిపోయినట్టు ద్వారక పోలీసులు తెలిపారు. ఏడుగురు మత్సకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో ఇద్దరు కోసం తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలలో చిక్కుకొని ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. జూన్ 15 నుంచి అగస్టు 30 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Latest Updates