2 నెలల్లో భారత్ కు 15 లక్షల మంది.. గుర్తించకపోతే ప్రమాదం

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్  ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో చూస్తున్నాం. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగవంతంగా ఉంది. గత 24 గంటల్లోనే 149 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే ఈ వైరస్ తీవ్రత అర్థం చేసుకోవచ్చు. భారత్ లో ఇప్పటి వరకు 902 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..20 మంది చనిపోయారు. ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అయినా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.

అయితే ఈ వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో  రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు  కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాసిన లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత రెండు నెలల్లో  15 లక్షల మందికి పైగా భారత్ వచ్చారని తెలిపారు. 2020 జనవరి 18 నుంచి మార్చి 23 వరకు ఎంతమంది విదేశాల నుంచి వచ్చారని ఆరా తీయగా.. 15 లక్షల మందికి పైగా విదేశాల నుంచి భారత్ కు వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్  వెల్లడించిందన్నారు. వీరిపై నిఘా పెట్టి ,టెస్టులు చేసి క్వారంటైన్ కు పంపాలని ఆదేశించారు. వారంతా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంత మంది ఆచూకీ తెలియడం లేదని..వారిని గుర్తించి క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. వాళ్లను గుర్తించకపోతే ముప్పు తప్పదన్నా రు.

Latest Updates