మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో 15 లక్షలకు టోపీ

మహిళలను మోసగించిన నలుగురి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ మహిళలను మోసం చేస్తున్న నలుగురిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్ వివరాల ప్రకారం..కొండాపూర్ కు చెందిన సుబోత్(28), మదీన గూడ వాసి ఉదయ్జీవన్(29), మల్కాజిగిరిలో ఉండే దీక్షిత్(30), ఓల్డ్ సిటీకి చెందిన రాహుల్ మలానీ(28) ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. తమ దగ్గర పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తామంటూ మనీ సర్క్యులేషన్ స్కీం పేరుతో మియాపూర్ , మదీనగూడ ఏరియా ల్లో లక్షల రూ పాయలు వసూలు చేశారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ర్ గా చేశారు. రూ.15లక్షలు ఇచ్చి తాము మోసపోయినట్టు తెలుసుకున్న మియాపూర్ కు చెందిన ముగ్గురు మహిళలు డబ్బు వాపస్ అడిగితే.. ఇవ్వకపోగా, సుబోత్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితుల కంప్లయింట్ తో మియాపూర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates