మావోల బీభత్సం..16 మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి దాదాపుర్ లో 36 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టిన గంటల్లోనే తాజాగా బుధవారం మధ్యాహ్నం జవాన్‌ల వాహనాన్నిఐఈడీతో  పేల్చేశారు. జాంబీర్ కేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడులో వాహనం ముక్కలు ముక్కలు అయ్యింది. ఈ ఘటనలో 15 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Latest Updates