స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న గొర్రెలు

15-sheep-enrolled-in-france-school-in-bid-to-save-it

ఓ స్కూల్లో 15 గొర్రెలు అడ్మిషన్ తీసుకున్నాయి.  ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఫ్రాన్స్‌లోని  ఆల్ప్స్ పర్వత శ్రేణిలో క్రెట్సిన్ బెలడోని గ్రామంలో ఓ స్కూల్ ఉంది. ఆ పాఠశాలలో 11 క్లాసులు నడుస్తున్నాయి. అందులోని ఒక క్లాసులో విద్యార్థుల సంఖ్య 266 నుంచి 261 పడిపోయింది. దీంతో  ఆ క్లాస్‌ను మూసేస్తామని.. స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. అదే జరిగితే తమ పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని…ఓ విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందారు.

ఈ క్రమంలోనే 15 గొర్రెలను తీసుకెళ్లి ఆ స్కూల్ లో చేర్పించారు పిల్లల పేరేంట్స్ . వాటి బర్త్ సర్టిఫికెట్లు చూపించి అధికారికంగా అడ్మిషన్ తీసుకున్నారు. వాటికి పేర్లు పెట్టి స్కూల్ రిజిస్టర్‌లో పేర్లను నమోదు చేశారు. దీంతో ఇకపై క్లాసులను రద్దుచేసే అవకాశమే ఉండదని తల్లిదండ్రులు చెప్పారు. ఈ వింత నిరసనతో వారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పిల్లల పేరెంట్స్… పిల్లల సంఖ్యపై కాకుండా,  వారి సంక్షేమం మీద శ్రద్ధ పెట్టాలని జాతీయ విద్యామండలికి చురకలు అంటించారు.

Latest Updates