సరూర్‌‌నగర్ బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 15 మంది పిల్లలకు అస్వస్థత

V6 Velugu Posted on Nov 27, 2021

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ బీసీ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థులను ముందుగా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు హాస్టల్ సిబ్బంది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా హాస్టల్ లో మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. వార్డెన్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. 

కాగా, నీలోఫర్‌‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు మహాత్మ జ్యోతి బాఫూలే బీసీ హాస్టల్స్ వెల్పర్  సెక్రటరీ మల్లయ్య బట్టు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.రేపట్నుంచి క్లాసు కంటిన్యూ అవుతాయని తెలిపారు.

Tagged Hyderabad, students, Saroor Nagar, Food Poisoning, BC Welfare Hostel

Latest Videos

Subscribe Now

More News