యూపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్

లక్నో: యూపీలో దారుణం జరిగింది. 15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు 15 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఆ బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు రేప్ చేసి పరారయ్యారని ముజఫర్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుభాష్ గౌతమ్ మీడియాకు తెలిపారు. బాలిక ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కంప్లైంట్ చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశామన్నారు.

Latest Updates