జీహెచ్ఎంసీ సిత్రాలు.. ఒకే ఇంటి నెంబర్‌పై 152 ఓట్లు

జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. వివిధ పార్టీల అభ్యర్థులు తమతమ డివిజన్లలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ డివిజన్‌కు చెందిన ఓటర్ లిస్టును పట్టుకొని ఏ ఓట్లు ఎవరికి పడతాయోనని అంచనాలు వేస్తున్నారు. కాగా.. ఓటర్ లిస్టులో వచ్చిన తప్పులు అభ్యర్థులకు, లీడర్లకు తలనొప్పిగా మారాయి. ఓకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకే వ్యక్తికి వేర్వేరు బూతుల్లో కూడా ఓట్లు ఉన్నాయి. తాజాగా యాకత్‌పురా నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 123లో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయి. ఆ బూతులోని 17-1-315 ఇంటి నెంబర్‌లో ఉండేది కేవలం ఏడుగురే. కానీ, ఆ ఇంటి నెంబర్ మీద మాత్రం ఓటర్ లిస్టులో ఏకంగా 152 ఓట్లున్నాయి. ఆ ఇంటి నెంబర్‌ మీద బై1, బైఏ, బై11.. అంటూ వివిధ బై నెంబర్లతో 152 ఓట్లు నమోదు చేశారు. ఇలా ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇదే తప్పు జరిగింది. మలక్‌పేట్ నియోజకవర్గంలోని 16-7-697 ఇంటి నెంబర్ మీద దాదాపు 80 ఓట్లు నమోదు చేశారు. దాంతో అభ్యర్థులు లిస్టులో పేరున్న ఓటర్ల కోసం వెతికే పనిలో పడ్డారు. వారిని వెతికి ఎలాగైనా ఓటు వేయించుకోవాలని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు ఒకే బూతులో కాకుండా.. వేర్వేరు బూతుల్లో ఓట్లు కల్పించారు. దాంతో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు.

For More News..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

Latest Updates