అరుణాచల్ ప్రదేశ్ సీఎం పై అత్యాచార ఆరోపణలు

pemaతనపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ  చేసిన ఆరోపణలతో ఆ రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేగింది. 2008 జులైలో పెమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, అయితే ఆ సమయంలో తాను స్పృహలో లేనని, ఘటనపై ఎంత మందికి విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆమె తెలిపింది. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత 2015లో ఆమె ఇటానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులో ఇది అంతా అబధ్ధం అని తేల్చేశారు. అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా సంఘాన్ని(NWC) ఆశ్రయించడంతో ఎన్‌ డబ్ల్యూసీ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్ డబ్లూసీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో తగిన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు ఆమె సిద్దమైంది. నాపై అత్యాచారం జరిగినప్పుడు పెమా ఖండూ సీఎం పదవిలో లేడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి నా మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు అని ఆమె తెలిపింది. ఏడాది కాలంగా తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె తెలిపింది. అయితే ఇవన్నీ రాజకీయంగా నన్ను దెబ్బ తీసేందుకు ప్రత్యర్ధులు చేసిన కుట్ర అని అన్నారు పెమా ఖండూ.

 

Posted in Uncategorized

Latest Updates