తెలంగాణ‌లో మ‌రో 1590 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి విజృంభిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 5290 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1590 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. తాజా కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఏడుగురు క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది. ఈ ఒక్క రోజులో భారీగా 1166 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 12,703కి చేరింది. ప్ర‌స్తుతం 10,904 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1277 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో 125 మందికి, రంగారెడ్డి జిల్లాలో 82 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

Latest Updates