యుద్ధ వీరుని కత్తి అచ్చం అలాగే..

15వ శతాబ్దం నాటి ఓ స్పానిష్‌ యుద్ధ వీరుడు అలీ అతార్‌. ఆయన వాడిన కత్తి చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం స్పెయిన్‌ లోని టొలెడో ఆర్మీ మ్యూజియంలో ఉంది. దాన్నిచూసేందుకు అంతదూరం వెళ్లాల్సిన అవసరంలేకుండా 3డీ టెక్నాలజీతో ‘అరె.. అచ్చం అదే కత్తి’ అనేలా రూపొందించారు వాలెన్సియా యూనివర్సిటీ రీసెర్చర్లు. ఇందుకు టొలెడోకు చెందిన ఓకంపెనీ సాయం తీసుకున్నారు. 360 డిగ్రీల్లో కత్తినిచూడొచ్చు. దీనికి ఫొటోగ్రామెట్రీ టెక్నిక్‌ ను వాడారు. అన్ని కోణాల్లో కత్తి ఫొటోలు తీశారు. అన్నింటినీ సాఫ్ట్ వేర్‌ సాయంతో ఒక్క దగ్గరకు చేర్చి అచ్చం పాతరూపంలానే సృష్టించారు.బంగారం, లోహాలతో..అలీ కత్తిని స్టీల్‌, బంగారం, విలువైన లోహాలు, ఐవరీతో తయారు చేశారు. 15వ శతాబ్దం నాటి ‘బ్లాక్‌ స్మిత్‌’కు మంచి ఉదాహరణ ఆ కత్తి. కొనమొదలు పట్టుకునే పిడి వరకు బంగారం, లోహాలతో అందంగా తీర్చిదిద్దారు. కత్తి పిడికి ముందు భాగాన్నికట్టడాల్లోని డోము ఆకారంలో బంగారంతో తయారు చేశారు. తర్వాత భాగాన్ని జంతువుల దంతాల పదార్థంతో రూపొందించారు. దానిపై అందమైన డిజైన్లు చెక్కారు. పిడికిలి, దాని తర్వాత భాగాన్నీ బంగారం, విలువైన లోహాలతోనే చేశారు.

గ్రనాడా రాజు మామ అలీ
1483లో ఇబెరియన్‌ ద్వీపకల్పంలోని గ్రనాడా రాజ్యం సుల్తాన్‌ ‘కింగ్‌ బొవాబ్డిల్‌ ’. నర్సిద్‌ వంశానికి చెందిన వాడు. గ్రనాడాను 1230 నుంచి 1492 వరకు ఈ వంశమే పాలించింది. ఇబెరియన్‌ చివరి ముస్లిం పాలకులు నర్సిద్‌ వంశం వారు. చివరిసుల్తాన్‌ బావాబ్డిల్‌ . యుద్ధవీరుడు అలీకిరాజు అల్లుడు. అలీ సాయంతో క్రిస్టియన్‌సిటీని ఆక్రమించుకోడానికి ప్రయత్నించాడు. కానీ యుద్ధం లో ఓడిపోయారు. 90 ఏళ్లవయసులో అలీ యుద్ధ భూమిలోనే ప్రాణాలొదిలాడు. ఆయన కత్తిని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు. త తర్వాత నుంచి క్రిస్టియన్‌ కమ్యూనిటీ దాన్ని భద్రంగా కాపాడుతూవచ్చింది.

Latest Updates