16న ఏపీ బంద్

Andra-Pradesh-Mapఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది హోదా సాధన సమితి. ఈ బంద్‌కు వైఎస్సార్‌ సీపితో పాటు అన్నీ వామపక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్‌ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి  దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 16న నిర్వహించదలచిన బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్‌ విజయవంతం చేయాలని  కోరారు శ్రీనివాస్.

Posted in Uncategorized

Latest Updates