16న కృష్ణా బోర్డు సమావేశం

హైదరాబాద్ : కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని జలాల లభ్యత గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా బోర్డు ఈ నెల 16న జలసౌధలో సమావేశం కానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యమవుతున్న జలాల పంపిణీ, వాటాకు మించి ఏపీ చేసిన వినియోగం, భవిష్యత్‌ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు హాజరు కానున్నారు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంతో పాటు బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ అంశాలను సైతం ఎజెండాలో చేర్చారు.

Posted in Uncategorized

Latest Updates