గల్వాన్ వీరులకు రిపబ్లిక్ డే వేడుకల్లో పురస్కారాలు

న్యూఢిల్లీ: గతేడాది జూన్‌‌ 15న చైనాతో జరిగిన ఘర్షణల్లో చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీని భారత దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. 16వ బెటాలియన్‌‌కు చెందిన కల్నల్ బి.సంతోష్ బాబు నేతృత్వంలో జవాన్లు పీఎల్‌‌ఏకు దీటుగా బదులిచ్చారు. ఈ ఘర్షణలో ప్రాణాలకు తెగించి పోరాడిన జవాన్లకు రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను అందజేయనుంది. అయితే ఎన్ని మెడల్స్, ఎంతమందికి అందిస్తారనే దానిపై డిఫెన్స్ మినిస్ట్రీ ఎలాంటి వివరాలు చెప్పలేదు. అమరుడైన కల్నల్ సంతోష్‌‌బాబుతోపాటు మరో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లకు పతకాలు అందజేయనున్నారని సమాచారం.

Latest Updates