‘వాస్కో డ గామా’లో 16 మంది సాకర్ ప్లేయర్స్ కు వైరస్

బ్రెసీలియా: పదహారు మంది సాకర్ ప్లేయర్స్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ లోని వాస్కో డ గామా క్లబ్ సోమవారం ప్రకటించింది. రెండు నెలల లాక్​డౌన్ తర్వాత క్లబ్ తెరుస్తున్న సందర్భంలో.. 43 మంది ఫుట్ బాల్ ప్లేయర్లకు టెస్టులు నిర్వహించగా అందులో 16 మందికి వైరస్ సోకినట్లు తేలిందని తెలిపింది. అందులో ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. బ్రెజిల్​లో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,14,849 కు చేరుకుంది. 29,314 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారిక వెబ్​సైట్ లో నివేదించింది. యూఎస్, బ్రిటన్, ఇటలీ తర్వాత బ్రెజిల్ అత్యంత ఎక్కువ కరోనా కేసులతో నాలుగో స్థానంలో ఉంది.

Latest Updates