ప్రమాదంలో 160 కోట్ల మంది జాబ్స్

  • ప్రపంచంలోని సగం మంది కార్మికులపై కరోనా ఎఫెక్ట్
  • వెంటనే ఆదుకోవాలని కోరిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్

జెనీవా: కరోనా మహామ్మారి ఎఫెక్ట్ ప్రపంచంలోని సగం మంది కార్మికుల్లో ఆందోళన రేపుతోంది. దాదాపు 160 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డారని యూఎన్ లేబర్ విభాగం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తెలిపింది. కరోనా కారణంగా అన్ని దేశాల్లో వర్క్ హావర్స్ తగ్గించారు. లాక్ డౌన్ తో మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. ఈ ఎఫెక్ట్ కొన్ని కోట్ల కంపెనీలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఫలితంగా వరల్డ్ వైడ్ గా సిచ్యూవేషన్ ను అంచనా వేస్తూ ‘ ఐఎల్ఓ మానిటర్ థర్డ్ ఎడిషన్ కొవిడ్ 19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్’ పేరిట యూఎన్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ నివేదికలో కరోనాను మించిన ప్రమాదకర పరిస్థితులు భవిష్యత్ లో ఎదుర్కొవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ విభాగంలో వరల్డ్ వైడ్ గా దాదాపు 43 కోట్ల కంపెనీలు అత్యంత ఎఫెక్ట్ అయ్యాయంట. రిటైల్, మ్యాన్ ఫాక్చర్ సెక్టార్లను కరోనా కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని ఐఎల్ఓ పేర్కొంది.
బతుకుడు బండి కష్టమే
కరోనా కారణంగా అత్యంత ఎఫెక్ట్ అవుతున్నది ప్రపంచవ్యాప్తంగా లేబర్సే. మొత్తం 330 కోట్ల మంది వరకు కార్మికులుండగా దాదాపు 160 కోట్ల మందికి బతుకు భారంగా మారింది. వీరంతా ప్రస్తుతం కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఎఫెక్ట్ అయిన రంగాల్లోనే ఎక్కువ కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు వీరికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. చాలా వరకు అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లే కావటంతో ఉపాధి, జీవనానికి వీరికి భరోసా లేకుండా పోయిందని ఐఎల్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదాయం లేదంటే వీరికి తిండి లేనట్లే. ఇలాంటి వారి వద్ద పొదుపు చేసుకున్న డబ్బులు ఉండవు. అప్పులిచ్చే వారుండరని తెలిపింది.
ఆదాయమే కొంచెమే
కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లేబర్స్ ఆదాయం భారీగా తగ్గింది. మొదటి నెల రోజుల్లోనే 60 శాతం ఆదాయం పడిపోయి లేబర్స్ ఇబ్బంది పడ్డారు. ఆఫ్రికా, అమెరికా ల్లో అయితే 80 శాతం ఆదాయాన్ని కార్మికులు కోల్పోయారు. మిడిల్ ఏషియా, యూరోప్ లలో 70 శాతం ఆదాయం తగ్గింది. ఏషియా ఫసిఫిక్ లో కాస్త బెటర్ గా పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు 22 శాతం ఆదాయన్ని లేబర్స్ కోల్పోయారు. సాధారణంగా కార్మికుల వచ్చే ఆదాయంతో రోజు వారీ అవసరాలు తీరటమే కష్టం. అలాంటి సగానికి పైగా ఆదాయం లేక వారు తినటానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వారి భవిష్యత్ ప్రమాదంలో పడినట్టేనని ఐఎల్ఓ హెచ్చరించింది.
సత్వర చర్యలు అవసరం
ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటోంది అత్యంత ప్రమాదకర పరిస్థితిగా ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ అభివర్ణించారు. వెంటనే వారిని ఆదుకోకపోతే మొత్తం వ్యవస్థ నాశనమవుతుందని హెచ్చరించారు. ఇది మరింత దుర్భర పరిస్థితులకు కారణమవుతుందని చెప్పారు. లేబర్స్ ను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాలని కోరారు. ముఖ్యంగా అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ స్మాల్ అండ్ మీడియం సెక్టార్లకు అన్ని దేశాలు అండగా ఉండాలని కోరారు.

Latest Updates