165 రోజులు అక్కడే : మోడీ విదేశీ టూర్ల ఖర్చు ఇది

FORప్రధానమంత్రి మోడీ విదేశీ పర్యటనల వివరాలు, ఖర్చులను PMO బయటపెట్టింది. ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. 2014లో ప్రధాని పదవి చేపట్టనప్పటినుంచి ఇప్పటివరకూ  41 విదేశీ పర్యటనలు, 52దేశాల్లో నరేంద్రమోడీ పర్యటించారు. బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త భీమప్ప గదాద్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు రూ.355 కోట్లు ఖర్చు అయినట్లు PMO తెలిపింది. ఈ నాలుగేళ్లలో 165 రోజులు విదేశాల్లోనే మోడీ బస చేశారు. ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్‌ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు PMOతెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలోని ఎక్కువదేశాల్లో పర్యటించిన భారత ప్రధానిగా, విదేశాల్లోనే ఎక్కువగా గడిపిన భారత ప్రధానిగా మోడీదే రికార్డు.

Posted in Uncategorized

Latest Updates