167 మంది డ్రైవింగ్  లైసెన్స్ లు రద్దు

రోడ్డు భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో  2,282 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.   పట్టుబడిన వాహనదారులను నాంపల్లి కోర్టు 3 , 4 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ట్రాఫిక్ పోలీసులు హాజరు పరిచారు . 498 మంది వాహనదారులకు జైలు శిక్ష విధించారు. 167 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను రెండేళ్ల నుంచి ఆరేళ్ల పాటు రద్దు చేశారు. పట్టుపడిన వారి వద్ద నుంచి రూ.49,64,400ల  జరిమానా వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Latest Updates