కరోనా అనుమానంతో 167 మంది మిస్సింగ్

కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్న 167 మంది పంజాబ్ లోని లూధియానాలో కనిపించకుండా పోయారు. కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కాంటాక్ట్​ అయినోళ్లను ట్రాక్​ చేస్తున్న అధికారులకు వారి జాడ తెలియరాలేదు. మరో 29 మంది ఆచూకీని మాత్రం కనుగొన్నారు. విదేశాల నుంచి వచ్చినోళ్లు, వాళ్లను కలిసి నోళ్ల లిస్టును రాష్ట్రంలోని మెడికల్​ అధికారులందరికీ ప్రభుత్వం పంపించింది. వాళ్లను పట్టుకునేందుకు రెండు టీంలను ఏర్పాటు చేశామని లూధియానా సివిల్​ సర్జన్​ తెలిపారు. కరోనా లాక్​డౌన్​తో ప్రజలకు ఒకేసారి మూడు నెలల రేషన్​ సరుకులు ఇచ్చేలా ఒడిశా సర్కార్​ ఏర్పాట్లు చేసింది.

Latest Updates