మూడు గుడ్లకు రూ. 1672 బిల్లు…

ఇదేంటి మూడు గుడ్లకు రూ. 1672 బిల్లేంటి అనుకుంటున్నారా… అవునండీ మీరు విన్నది.. చూస్తున్నది నిజమే. మూడు ఉడకపెట్టిన గుడ్లకు రూ. 1672 బిల్లు వేసిన ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రవ్జియాని అహ్మదాబాద్‌లోని హోటల్ హయత్ రీజెన్సీలో స్టే చేశారు. ఆయన గురువారం రోజు మూడు బాయిల్డ్ ఎగ్స్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. హోటల్ సర్వర్ గుడ్లను తీసుకొచ్చి శేఖర్ చేతిలో బిల్లు పెట్టాడు. దాన్ని చూసిన శేఖర్ కంగుతిన్నాడు. ఆ బిల్లులో మూడు గుడ్లకు రూ. 1672 బిల్లు ఉంది. మూడు ఉడకబెట్టిన గుడ్లకు రూ. 1350, సర్వీస్ చార్జీ రూ. 67.50 పైసలు , సీజీఎస్టీ రూ. 127.58 పైసలు, ఎస్‌జీఎస్టీ రూ. 127.58 పైసలుగా ఉంది. అది చూసిన శేఖర్ చేసేదేం లేక ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

Latest Updates